హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఈ నెల 6న గాంధీ భవన్‌లో పీఈసీ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న పీఈసీ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ, గెలుపు వ్యూహాలపై చర్చించనున్నారు. ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరించి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ, పీఈసీ సభ్యులు పాల్గొంటారు.
