ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీష్‌ రావ్‌లపై సిఎం రేవంత్‌ ఫైర్‌

Dec 16,2023 13:22 #Assembly Meeting, #Telangana CM

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సభలో వాడీవేడీ చర్చ సాగుతోంది. ఈరోజు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన అనంతరం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మాటల యుద్ధం జరిగింది. దీంతో ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీష్‌ రావ్‌ లపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. ”పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగి పడవు” అంటూ రేవంత్‌ కౌంటర్‌ ఇచ్చారు. కొంత మంది ఎన్‌ఆర్‌ఐలకు ప్రజా స్వామ్య స్ఫూర్తి తెలియదన్నారు. 51 శాతం నెంబర్‌ ఉన్న వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్నారు. సహేతుకంగా విశ్లేషణ చేయాలి ప్రతిపక్షం అన్నారు. అచ్చోసిన ఆంబోతులం ..పోడియంకి వస్తాం అంటే అహం సరికాదంటూ ఫైర్‌ అయ్యారు. పదే పదే గత పాలన గురించి మట్లాడుతున్నారన్నారు. కేసీఆర్‌ యూత్‌ కాంగ్రెస్‌ అద్యక్షుడుని చేసింది కాంగ్రెస్‌ అన్నారు. కేసీఆర్‌ని ఎంపీగా గెలిపించింది కాంగ్రెస్‌ అన్నారు. కేంద్ర మంత్రి చేసిందే కాంగ్రెస్‌ అన్నారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యుడుని ఎమ్మెల్యే కాకుండా మంత్రిని చేసింది వైఎస్‌ అన్నారు. పోతిరెడ్డిపాడు పొక్క పెంచునప్పుడు కొట్లాడింది పీజేఆర్‌ అన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఆరోజు ఎవరు కొట్లాడలేదన్నారు. మా పార్టీ పీజేఆర్‌ కొట్లాడారని తెలిపారు.

➡️