కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా రామచంద్రరావు

Feb 2,2024 08:12 #geetha karmikula, #new committee

నూతన కమిటీ ఎన్నిక

ప్రజాశక్తి – తణుకు రూరల్‌ :ఆంధ్రప్రదేశ్‌ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వాక రామచంద్రరావు, జుత్తిగ నరసింహమూర్తి ఎన్నికయ్యారు. సంఘం 15వ రాష్ట్ర మహాసభ పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జనవరి 30, 31 తేదీల్లో జరిగిన సంగతి తెలిసిందే. 31వ తేదీ సాయంత్రం నూతన కమిటీ ఎన్నికైందని ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి గురువారం తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కామన మునిస్వామి, ఎర్ర దేముడు, యామినేని స్టాలిన్‌, సిమా అప్పారావు, సహాయ కార్యదర్శులుగా బత్తిన నాగేశ్వరరావు, బక్కా చంటి, మరో 16 మంది సభ్యులుగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు. మహా సభ తీర్మానాలివే గీత వృత్తి రక్షణకు ప్రభుత్వం సమగ్ర చట్టం చేయాలి, గీత వృత్తిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, వికలాంగులైన వారికి పరిహారం 30 రోజుల్లో చెల్లించాలి, చెట్లకు మార్కింగ్‌ విధానాన్ని అమలు చేయాలి, పెన్షన్‌ రూ.ఐదు వేలు ఇవ్వాలి. గీత కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని తీర్మానించారు.

➡️