హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాలపై ఏర్పాటు చేసిన కమిటీ 4 నెలల్లో రిపోర్టు ఇవ్వనుంది. వీటిపై అధ్యయనానికి డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీకి సీడబ్ల్యూసీ మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కమిటీలో ఛైర్మన్‌తో పాటు యు.సి.విద్యార్థి, ఆర్.పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్, అమితాబ్ సభ్యులుగా ఉన్నారు.
