ఛలో విజయవాడకు అనుమతులు లేవు.. అమల్లో 144 సెక్షన్‌

అమరావతి: సీపీఎస్‌ ఉద్యోగులు ఇవాళ, రేపు తలపెట్టిన ఛలో విజయవాడకు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఛలో విజయవాడ నిర్వహణకు సిద్ధమైతే చట్టపర చర్యలుంటాయని హెచ్చరించారు. విజయవాడలో సెక్షన్‌ 30, 144 అమలులో ఉన్నాయని కమిషనర్‌ కార్యాలయం ప్రకటించింది.. మరోవైపు, ఛలో వరకు విజయవాడ నిర్వహించాలని చూసిన సీపీఎస్‌ నాయకులు పలువురిని ఇప్పటికే పోలీసులు అరెస్టులు చేశారు. ఎవరూ ఆందోళనకు పాల్గన్నా అరెస్ట్‌లు తప్పవని స్పష్టం చేశారు. అయితే, ఏపీ సీపీఎస్‌ ఉద్యోగులు ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. . అందులో భాగంగా విజయవాడ ధర్నాచౌక్‌ లో ఛలో విజయవాడ నిర్వహణకు అనుమతులు కోరగా పోలీసులు నిరాకరించారు.. పలువురు సీపీఎస్‌ నాయకులను అరెస్టులు చేశారు.. సీపీఎస్‌ వద్దు ఓపీఎస్‌ కావాలి అనేది మాత్రమే తమ డిమాండ్‌ అనిసీపీఎస్‌ సంఘ జాయింట్‌ సెక్రెటరీ సి.మరియదాసు. అంటున్నారు. జీపీఎస్‌కు ఎలాంటి మద్దతు తెలపలేదని, ఆ అంశంపై చర్చలే జరగలేదని.. ఏ నలుగురూ అయితే జీపీఎస్‌ కు సరే అన్నారో వారికి అమలు చేయమని అంటున్నారు. జీపీఎస్‌ వల్ల తమ డబ్బులు ఇన్వెస్ట్మెంట్‌ గా మారుతున్నాయి.. కానీ, అత్యవసర పరిస్ధితుల్లో వారి డబ్బులు వారే వినియోగించుకునే అవకాశం లేకుండా పోయిందని సీపీఎస్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

➡️