వరంగల్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తహశీల్దార్‌గా పనిచేస్తున్న రజని ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక విభాగం హనుమకొండ కేఎల్‌ఎన్ రెడ్డి కాలనీలోని ఆమె నివాసంతో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో దాడులు చేస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో సోదాలు చేపట్టారు. భూములకు సంబంధించిన విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
