తిరుపతి ‘జూ’లో ఆడ సింహం మృతి

Mar 6,2024 17:52 #lion died, #tirupathi zoo

తిరుపతి : తిరుపతి వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో ఏడు సంవత్సరాల ఆడ సింహం అనారోగ్యంతో మృతి చెందింది . సింహానికి పెల్విస్‌లో ట్యూమర్లు, తోక వద్ద తీవ్ర గాయం కారణంగా వైద్యులు చికిత్సను అందజేశారు. గత ఏడాదిన్నరగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతుంది. ఈ గాయం తీవ్రం కావడంతో శస్త్ర చికిత్స చేశారు.సింహం గత నాలుగు రోజుల నుంచి ఆహారం, నీరు తీసుకోవడం పూర్తిగా మానేయడంతో చనిపోయిందని క్యూరేటర్‌ సెల్వం తెలిపారు. కాగా అటవీ శాఖ, జంతు ప్రదర్శన శాల సిబ్బంది సింహం కళేబరాన్ని ఎస్పీ వెటర్నరీ కళాశాలలో పోస్టుమార్టం చేయించారు. సెప్టిసెమియాతో పాటు డీహైడ్రేషన్‌తో సింహం మరణించిందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు.

➡️