హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 17న జరగాల్సిన జెన్ కో రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 17న ఇతర పరీక్షలు ఉన్నందున జెన్ కో పరీక్షలను వాయిదా వేసినట్లు తెలంగాణ జెన్ కో వెల్లడించింది. పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని టీఎస్ జెన్ కో తెలిపింది.తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రజావాణిలో పలువురు అభ్యర్థులు.. జెన్‌కో పరీక్షలను వాయిదా వేయాలని వినతులు ఇచ్చారు. 17న ఇతర పరీక్షలు ఉన్నందును జెన్ కో పరీక్షలను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబును కోరారు. వారి అభ్యర్థనపై స్పందించిన మంత్రి.. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దఅష్టికి తీసుకెళ్తానని చెప్పారు. సంబంధిత అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే పరీక్షలను వాయిదా వేస్తూ తెలంగాణ జెన్ కో నిర్ణయం తీసుకుంది.
