నెల్లూరులో విష జ్వరాలు విజృంభణ

Feb 18,2024 15:50 #affected areas, #nelluru, #Viral Fever

నెల్లూరు:నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నూతక్కి వారి కండ్రికలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతి ఇంట్లోనూ ఒకరిద్దరు జ్వరాలతో సతమతవుతున్నారు. వారం రోజులుగా ఇదే పరిస్థితి. చాలా మంది నెల్లూరు వైద్యశాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. వారం రోజుల నుంచి జ్వరాలు తగ్గకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పారిశుద్ధ్య లోపంతో దోమలు పెరగడంతో.. డెంగీ జ్వరాలేమోనని భయపడుతున్నారు. అంతేకాకుండా.. ఒళ్లు నొప్పులతో కదల్లేకపోతున్నామని నీరసంగా ఉంటోందని బాధితులు వాపోతున్నారు.గ్రామంలో పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం వల్ల ఇళ్ల మధ్యలో మురుగు నిలిచి దోమలు వ్యాపిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. దీనికి తోడు దుర్గంధం భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ జ్వరాలు ప్రబలకుండ ఉండేందుకు అధికారులు స్పందించి.. వైద్య సేవలు అందించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

➡️