ప్రొద్దుటూరులోని షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం

ప్రొద్దుటూరు (వైఎస్‌ఆర్‌) : ప్రొద్దుటూరులోని ఆకృతి షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రెండు అంతస్తుల్లో దట్టమైన పొగ అలముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పొగ బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో భవనం ముందు భాగంలో ఏర్పాటు చేసిన అద్దాలను ధ్వంసం చేశారు. ఆ సమయంలో పొగ పీల్చుకోవడంతో అగ్నిమాపక సిబ్బంది సాంబ శివారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️