అమరావతి : వైఎస్సార్ జిల్లా లింగాల మండలం ఇప్పట్ల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అనంతపురం నుంచి పులివెందులకు కారులో వెళుతుండగా రోడ్డు పక్కన ఉన్న బావిలో కారు బోల్తా పడింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు మూడు గంటల పాటు క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు. మృతుల్లో ఒకరు మహారాష్ట్ర వాసి ప్రకాశ్ ఠాగూర్, ఢిల్లీకి చెందిన సునీల్ కేల్‌వానిగా పోలీసులు గుర్తించారు. మృతులు అరటిని కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు విక్రయించేవారని తెలిపారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు లింగాల పోలీసులు తెలిపారు.
