మంచిర్యాల: బిఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదని… వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కనీసం మంచి నీరూ అందించలేదని మంత్రి సీతక్క మండిపడ్డారు. రెండు పంటలకు సాగునీరు అందించే ప్రాజెక్టులు కూడా ఇక్కడ లేవన్నారు. ఉమ్మడి జిల్లా సమస్యలను ముఖ్యమంత్రి దఅష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ కోసం పోరాడిన ప్రొఫెసర్ కోదండరామ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తే గులాబీ నేతలు సహించలేకపోతున్నారని సీతక్క విమర్శించారు. శుక్రవారం ఇంద్రవెల్లిలో నిర్వహించే సీఎం బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆదివాసి బిడ్డనైన తనకు ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా బాధ్యతలు ఇవ్వడం అదఅష్టమన్న ఆమె… ఈ ప్రాంతాన్ని అభివఅద్ధి చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
