మహిళా సాధికారత టిడిపితోనే సాధ్యం : యనమల

విజయవాడ: మహిళా సాధికారత టిడిపితోనే సాధ్యమని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయమ్మ, షర్మిల, సునీతకు ఏ హాని జరిగినా దానికి జగన్‌దే బాధ్యత అని అన్నారు. సొంత బాబాయిని చంపిన అబ్బాయికి తల్లి, చెల్లి ఓ లెక్కా అని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘జగన్‌ రెడ్డి పాపం పండింది. అధికారం కోసం ఆయన చేసిన పాపాలే నేడు శాపాలుగా మారాయి. జగన్‌ 420 అని నిన్న వైఎస్‌ షర్మిల చేసిన వ్యాఖ్యలు అతడి నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయి. పులివెందులలో సొంత చెల్లెలు సునీతారెడ్డి సభ పెట్టుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకపోవడం మహిళలను అవమానించడం కాదా? సొంత కుటుంబ సభ్యుల నమ్మకమే పొందలేని జగన్‌ రెడ్డి ప్రజల్ని ఏ విధంగా ఉద్ధరిస్తారు? మహిళా సాధికారత టిడిపితోనే సాధ్యం. మహిళలకు ఆస్తి హక్కు, రిజర్వేషన్లు, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు టిడిపినే కల్పించింది’ అని యనమల గుర్తుచేశారు.

➡️