యాదగిరి గుట్ట పులిహోర ప్రసాదంలో ఎలుక!

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో తయారు చేసే పులిహోర ప్రసాదంలో ఎలుక వచ్చినట్లు సోష ల్‌ మీడియాలో శుక్రవారం చక్కర్లు కొట్టింది. ఓ కుటుంబానికి చెందిన భక్తులు శుక్రవారం ఉదయం శ్రీస్వామి వారిని దర్శించుకొని, అక్కడే ఉన్న ప్రసాద విక్రయ శాలలో లడ్డూ, పులిహౌర ప్రసాదం కొనుగోలు చేశారు. ఆ ప్రసాదాన్ని మొదటి ఘాట్‌ రోడ్డులో కూర్చుని తింటున్న క్రమంలో.. చనిపోయిన ఎలుక పులిహోరలో ప్రత్యక్షమైంది.

దీంతో కంగుతిన్న యాత్రికులు, వెంటనే ఆలయాధికారుల వద్దకు తీసు కెళ్లారు. యాత్రికులను ఆలయ అధికారులు సము దాయించి, వేరే పులిహోర ప్రసాదం అందజేసి, అక్కడి నుంచి పంపించారు. ఈ విషయాన్ని ప్రసాదం సెక్షన్‌ అధికారి అశోక్‌ కుమార్‌ను వివరణ కోరగా.. పులిహోర ప్రసాదంలో ఎలు క వచ్చినట్లు తమ దఅష్టికి వచ్చిందని, దీనిపై విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఈవో దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

➡️