రేపల్లె: బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గ వైసిపిలో సమన్వయకర్త మార్పు చిచ్చు రేపింది. రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ స్థానంలో డాక్టర్ ఈవూరు గణేశ్‌ను సమన్వయకర్తగా వైసిపి ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని రేపల్లె వైసిపి నేతలు వ్యతిరేకిస్తున్నారు. మోపిదేవి వెంకటరమణకే సమన్వయకర్త బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.మోపిదేవి వెంకటరమణ 14 ఏళ్లుగా పార్టీ అభివఅద్ధికి పనిచేస్తున్నా.. ఆయన్ను పక్కన పెట్టి గణేశ్‌ను సమన్వయకర్తగా నియమించడం బాధాకరమని వైసిపి నేతలు అన్నారు. రేపల్లెలోని వైసిపి కార్యాలయంలో ముఖ్యనేతలు సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో మోపిదేవికి మద్దతుగా వివిధ పదవుల్లో ఉన్న 150 మంది నేతలు రాజీనామా చేశారు. సమన్వయకర్త మార్పు నిర్ణయాన్ని వైసిపి అధిష్ఠానం పున్ణసమీక్షించాలని కోరారు. రాజీనామా చేసిన వారిలో మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్ ఛైర్మన్లు, రేపల్లె, చెరుకుపల్లి, నిజాంపట్నం మండలాలకు చెందిన నేతలు ఉన్నారు.
