ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిథి :సిపిఎం సీనియర్ నేత, నెల్లూరు జిల్లా మార్క్సిస్టు ఉద్యమ నిర్మాత జక్కా వెంకయ్య కుమార్తె కందల శారదమ్మ (63)కు కన్నీటి వీడ్కోలు పలికారు. నెల్లూరు ఎసి నగర్‌లోని ఆమె నివాసం నుంచి ఉదయం 10 గంటలకు అంతిమ యాత్ర సాగింది. పెన్నా తీరంలోని బోడిగాడితోట వద్ద అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, ఎం.మోహన్‌రావు, గోగుల శ్రీనివాస్, వెంకమరాజు, గోపాల్, వెంకయ్య, సిపిఎం సీనియర్ నేత చండ్రరాజగోపాల్, తదితరులు పాల్గన్నారు. అనారోగ్యంతో నెల్లూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం వేకువజామున ఆమె మరణించారు. జక్కా వెంకయ్య, పార్వతమ్మ దంపతుల నాల్గవ సంతానం శారదమ్మ. ఆమె ఒక్కగానొక్క కుమార్తె సౌమ్య లండన్‌లో నివసిస్తున్నారు.
