హైదరాబాద్ : డా.బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్, మహిళా శిశు సంక్షేమం శాఖ రూపొందించిన ప్రతిపాదనలపై మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష చేస్తున్నారు.ఈ సమావేశానికి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకఅష్ణ, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు,ఫైనాన్స్ జాయింట్ సెక్రటరీ హరిత, స్మితా సబర్వాల్, డిప్యూటీ సీఎం సెక్రటరీ కఅష్ణ భాస్కర్ తదితరులు హాజరయ్యారు.
