హైదరాబాద్: నల్గండ అసెంబ్లీ బరిలో దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు లభించిన సంగతి తెలిసిందే. ఆయనకు సినిమాటోగ్రఫీ, ఆర్ అండ్ బి శాఖలు అప్పగించారు. ఆదివారం ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన చాంబర్ లో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య మంత్రిగా తన కార్యకలాపాలు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక సినీ రంగం నుంచి దిల్ రాజు తప్ప మరెవరూ ఫోన్ చేయలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. తనకు మంత్రి పదవి ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి కఅతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. ఇవాళ పలు కీలకమైన ఫైళ్లపై సంతకాలు చేసినట్టు తెలిపారు. కాగా, వెంకట్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా హాజరయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు.
సినిమాటోగ్రఫీ, ఆర్ అండ్ బి శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి
