‘సీమ’కు గోదావరి జలాలు

Mar 27,2024 23:36 #Chandrababu Naidu, #prajagalam, #speech

-పవర్‌లూములు, చేనేత కార్మికులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌
-రాబోయే ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు
-50 ఏళ్లు నిండిన బిసిలకు పింఛన్‌
-‘ప్రజాగళం’ సభల్లో చంద్రబాబు
ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో, మదనపల్లి (అన్నమయ్య జిల్లా) :’రాయలసీమకు కృష్ణా జలాలు తీసుకురావాలని టిడిపి వ్యవస్థాపకులు ఎన్‌టి.రామారావు సంకల్పించారు. టిడిపి హయాంలో హంద్రీనీవా, గాలేరుానగరి, తెలుగంగను తీసుకొచ్చాం. మళ్లీ అధికారంలోకొస్తే సీమకు గోదావరి జలాలు రప్పిస్తాం’ అని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. పవర్‌లూములు, చేనేత కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ ఇస్తామని, నగరిలో టెక్స్‌టైల్‌ పార్కు పెట్టి చేనేతలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉపాధి దొరికేంత వరకూ నెలకు రూ.3 వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు. 50 ఏళ్లు నిండిన బిసిలకు పింఛను ఇస్తామని హామీ ఇచ్చారు. ‘ప్రజాగళం’ తొలిసభను చిత్తూరు జిల్లా పలమనేరులో బుధవారం ఆయన ప్రారంభించారు. నగరిలోనూ, అన్నమయ్య జిల్లా మదనపల్లిలోనూ ఈ సభలు జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అన్నదాత పథకం ద్వారా రైతుల ఖాతాల్లో ఏటా రూ.20 వేలు జమ చేస్తామని, డ్రిప్‌ ఇరిగేషన్‌కు సబ్సిడీలు ఇస్తామని, పెండింగ్‌లో ఉన్న తాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నేతం షుగర్‌ ఫ్యాక్టరీ ఇవ్వాల్సిన బకాయిలను వడ్డీతో సహా రైతులకు ఇప్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ‘దీపం’ పథకం కింద ఏడాదికి మహిళలకు మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ఆర్‌టిసి బస్సుల్లో ఉచితం బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక తొమ్మిదిసార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచిందన్నారు. తాము అధికారంలోకొస్తే విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పెట్టి పేదల కడుపునింపే కార్యక్రమం చేపడతామన్నారు. రాయలసీమను హార్టీకల్చర్‌ హబ్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు.
మదనపల్లిని జిల్లాగా చేస్తా
టిడిపి అధికారంలోకిస్తే మదనపల్లిని జిల్లాగా చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ పట్టణంలో అన్ని వసతులు ఉన్నా
ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, ఎంపి మిధున్‌రెడ్డి వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మదనపల్లిని జిల్లా కానీయకుండా అడ్డుకున్నారని విమర్శించారు. మదనపల్లిని ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతానని, ముస్లిaäర్తి తీరుస్తామని, సాగునీటికి శాశ్వత పరిష్కారం చూపుతామని అన్నారు.

➡️