మైలవరం: ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలో బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శనివారం ఉదయం వసతి గృహంలో ఉరి వేసుకుని కనిపించడంతో.. మిగతా విద్యార్థినులు వార్డెన్‌కు సమాచారం అందించారు. విద్యార్థిని మృతిపై తల్లిదండ్రులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అప్పటికే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. తమ కుమార్తె మరణానికి కారణాలు చెప్పాలంటూ అడ్డుపడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు తన సోదరుడితో మృతురాలు సంభాషించినట్లు తోటి విద్యార్థులు పోలీసులకు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు ఏసీపీ రమేశ్, సీఐ కృష్ణ కిశోర్ వెల్లడించారు.
