ప్రజాశక్తి-అనంతపురం : గ్రీన్ ఆర్మీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అనంతపురం పట్టణానికి చెందిన అనిల్ కుమార్.. పక్షులను రక్షించడానికి 1.40 లక్షల మానవ నిర్మిత గూళ్లు ఏర్పాటు చేశారు. యూకే (లండన్)కు చెందిన హార్వర్డ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఇది నమోదు అయ్యింది. అందుకు సంబంధించి సర్టిఫికెట్ అందించారు. అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్నలను అనిల్‌కుమార్ కలిశారు. అనిల్ కుమార్ మాట్లాడుతూ.. అనంతపురం నగరంలో గ్రీన్ ఆర్మీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పక్షులను రక్షించడానికి 1.40 లక్షల మానవ నిర్మిత గూళ్లను ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడా లేని విధంగా సహజ కొబ్బరికాయ, పీచుతో 1.40 లక్షల మానవ నిర్మిత గూళ్ళను ఏర్పాటు చేశామన్నారు. అందులో 2.50 లక్షల పిచ్చుకలు జన్మించాయని తెలిపారు. అనంతరం ‘ప్రతి ఇంటా ఓ చెట్టు, ప్రతి ఇంటిపై మన జెండా’ అనే పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.
పక్షుల కోసం 1.40 లక్షల మానవ నిర్మిత గూళ్లు : హార్వర్డ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు
