ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జాతీయ విద్యాదినోత్సవంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ దినోత్సవాన్ని కూడా ఈ నెల 11న నిర్వహించనున్నారు. విజయవాడలోని ఎ కన్వెన్షన్ సెంటర్‌లో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు. ప్రతి ఏటా సెప్టెంబర్ 11న జరగాల్సిన రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఈ ఏడాది వరదల కారణంగా నిర్వహించని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ విద్యా దినోత్సవం నాడే రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ దినోత్సవం కూడా నిర్వహించి పాఠశాల విద్య, కళాశాల, సాంకేతిక విద్య, యూనివర్సిటీల విభాగాల నుంచి ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రభుత్వం పురస్కారాలు అందజేయనుంది.