కొనసాగుతున్న భక్తుల రద్దీ -సర్వదర్శనానికి 12 గంటలు

ప్రజాశక్తి -తిరుమల :వేసవి సెలవులు ముగియనుండడంతో తిరుమలలో యాత్రికుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న యాత్రికులతో తిరుమలలోని 31 కంపార్టుమెంట్లు మంగళవారం నిండిపోయాయి. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. స్వామివారిని సోమవారం 78,064 మంది దర్శించుకున్నారు. 33,869 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ.3.70 కోట్ల ఆదాయం వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు.

➡️