వర్రా రవీందర్‌ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

జగ్గయ్యపేట : వైసిపి సోషల్‌ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌ రెడ్డికి జగ్గయ్యపేట కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న రవీందర్‌ రెడ్డిని ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట పోలీసులు పీటీ వారెంట్‌ పై మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులకు చెందిన రవీందర్‌ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లపై అసభ్యకర పోస్టులు పెట్టారనే ఫిర్యాదుల మేరకు అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. ఎన్టీఆర్‌ జిల్లా షేర్‌మహమ్మద్‌పేటకు చెందిన ఎనికే గోపి ఫిర్యాదు మేరకు చిల్లకల్లు పోలీసులు వర్రాపై ఐటీ యాక్ట్‌ ప్రకారం వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఈ కేసులో భాగంగా చిల్లకల్లు పోలీసులు కడప జైలుకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ముందుగా కడప జైలు అధికారులు వర్రాకు వైద్యపరీక్షలు చేయించారు. అనంతరం జగ్గయ్యపేట పోలీసులకు అప్పగించారు. బుధవారం ఆయన్ను జగ్గయ్యపేట కోర్టులో ప్రవేశ పెట్టగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ వధించారు. అనంతరం జగ్గయ్యపేట సబ్‌ జైలుకు ఆయన్ను తరలించారు.

➡️