శ్రీశైల యాత్రికుల వాహనం బోల్తా.. 15 మందికి గాయాలు

May 16,2024 10:31 #road accident, #srisailam

ప్రజాశక్తి – పెద్దదోర్నాల (ప్రకాశం జిల్లా) : శ్రీశైల యాత్రికుల వాహనం బోల్తాపడడంతో 15 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలోని చిన్నారుట్ల సమీపం ఆంజనేయస్వామి గుడి వద్ద గురువారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం, పేలకుర్తి గ్రామానికి చెందిన 25 మంది యాత్రికులు బుధవారం రాత్రి రెండు బొలేరో వాహనాల్లో శ్రీశైలానికి బయలుదేరారు. చిన్నారుట్ల ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఓ వాహనానికి బ్రేక్‌ ఫెయిలయ్యాయి. దీంతో అదుపుతప్పి వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రేమ్‌ కుమార్‌, నాగేష్‌, వెంకట రాములు, రమేష్‌, కేశవులు, మనోహర్‌, సురేష్‌, కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన ఎనిమిది మందికి స్పల్పగాయాలయ్యాయి. ఎస్‌ఐ అంకమ్మరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️