1,274 ఓట్ల పోలింగ్‌కు 18 గంటలు

May 15,2024 09:40 #1, #18 hours, #274 votes, #Polling

ప్రజాశక్తి- భోగాపురం (విజయనగరం జిల్లా) : విజయనగరం జిల్లా భోగాపురం పంచాయతీ అప్పన్నపేట పోలింగ్‌ కేంద్రంలో (230) 18 గంటల పాటు పోలింగ్‌ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్‌ ఇవిఎంలు మొరాయించడంతో రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. మరోవైపు సాయంత్రం ఎక్కువ మంది ఓటర్లు ఓటేసేందుకు రావడంతో పోలింగ్‌ సమయం ముగిసేసరికి సుమారు ఐదు వందల మంది ఓటర్లు క్యూలో ఉండడంతో వారంతా ఓటు వేసేందుకు తెల్లవారుజామున 3 గంటలైంది. దీంతో, పోలింగ్‌ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ పోలింగ్‌ కేంద్రంలో 1,274 ఓట్లు ఉన్నాయి. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్‌ ముగిసే సమయానికి వరుసలో ఉన్న సుమారు 500 మందికి అధికారులు టోకెన్లు జారీ చేశారు. పోలింగ్‌ కేంద్రం చిన్నదిగా ఉండడం, ఆలస్యం కావడంతో ఓటర్లంతా ఒకేసారి వెళ్లేందుకు ప్రయత్నించడంతో రద్దీ నెలకొంది. అర్ధరాత్రి 12 గంటలు దాటాక తేదీ మారిపోతుండడంతో అధికారులు వెంటనే మరో ఇవిఎంను ఏర్పాటు చేశారు.

➡️