జనగామ హాస్టల్‌లో19 మంది విద్యార్థులు పరార్‌..వసతులలేమే కారణం

Jul 13,2024 12:35 #19 students, #escaped, #Janagama hostel

పెంబర్తి : జనగామ జిల్లా పెంబర్తిలోని మహాత్మా జ్యోతిబాఫూలే హాస్టల్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. అర్థరాత్రి గోడ దూకి 19 మంది విద్యార్థులు పరారయ్యారు. పిల్లలు కనిపించక పోవడంతో తల్లిదండ్రులు భయాందోళన చెందారు. సుమారు ఆరు కిలోమీటర్లు నడిచి జనగామ ధర్మకంచలోని పాత వసతి గఅహానికి చేరుకున్నారు. ధర్మకంచం వద్ద పిల్లలు ఉన్నారనే సమాచారంతో తల్లదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అర్ధరాత్రి విద్యార్థులు హాస్టల్‌ నుంచి బయటకు వెళితే సిబ్బంది నుంచి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ధర్మకంచం హాస్టల్‌ ఎదుట తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పెంబర్తిలోని జ్యోతిబాఫూలే పాఠశాలలో సరైన వసతులు లేవని, ఇక్కడ ఉండడం కష్టంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. అధ్యాపకులు తమను వేధిస్తున్నారని, వసతులు లేవని అడిగితే ఇక్కడ ఇలాగే ఉంటుందని బెదిరిస్తున్నారని విద్యార్థులు వాపోయారు.
జనగామలోని ధర్మకంచ హాస్టల్‌లో సౌకర్యాలు ఉన్నాయని, ఇక్కడి నుంచి పెంబర్తి హాస్టల్‌కు తరలించాలని పేర్కొన్నారు. పాత హాస్టల్‌లోనే ఉంటామంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. అధికారులు స్పందించి ధర్మకంచ హాస్టల్‌ లో ఉండేలా కఅషి చేయాలని కోరారు. ఉపాధ్యాయులు మాట్లాడలేని భాషలో బూటకపు మాటలు మాట్లాడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పెంబర్తి హాస్టల్‌లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని ప్రిన్సిపాల్‌ అనిత పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పెంబర్తిలో మరో భవనాన్ని అద్దెకు తీసుకున్నామని, దూషించే ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.

➡️