19 నుండి ఇంజనీరింగ్‌ తుది, మూడో దశ ప్రవేశాల ప్రక్రియ – నోటిఫికేషన్‌ విడుదల

అమరావతి : ఇంజనీరింగ్‌ ప్రవేశాల కోసం నిర్దేశించిన ఎపి ఈఎపిసెట్‌ 2024 తుది, మూడో దశ అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు 19 ప్రారంభం అవుతుందని సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్‌ గణేష్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం గణేష్‌ కుమార్‌ మాట్లాడుతూ … ఆన్‌ లైన్‌ లో రిజిస్ట్రేషన్‌, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు ప్రక్రియను విద్యార్ధులు ఆగస్టు 19 నుండి ఆగస్టు 21 లోపు పూర్తి చేయవలసి ఉంటుందన్నారు. ఆగస్టు 19 నుండి ఆగస్టు 22 వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ ఉంటుందని, ఆగస్టు 20 నుండి 22 వరకు 3 రోజుల పాటు ఆప్షన్ల ఎంపిక పూర్తి చేసుకోవాలని కన్వీనర్‌ స్పష్టం చేశారు. ఐచ్చికాల మార్పుకు ఆగస్టు 23వ తేదీ నిర్దేశించామన్నారు. 26 వ తేదీన సీట్ల కేటాయింపును పూర్తి చేస్తామన్నారు. సెల్స్‌ జాయినింగ్‌, కళాశాలలో రిపోర్టింగ్‌ కోసం ఆగస్టు 26 నుండి ఆగస్టు 30 వరకు ఐదు రోజులపాటు అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే జులై 19వ తేదీ నుండి తరగతులు ప్రారంభం అయ్యాయని కన్వీనర్‌ వివరించారు. విద్యార్థులు ఐచ్ఛికాల ఎంపిక సందర్భంలో ఓటీపీలను ఇతరులకు ఇవ్వవద్దని, అది సమస్యలకు దారి తీస్తుందని సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు గణేష్‌ కుమార్‌ హెచ్చరించారు.

➡️