చేప ప్రసాదానికి 2 లక్షల చేప పిల్లలు

Jun 8,2024 14:27 #2 lakhs, #fish, #fish offering

తెలంగాణ : చేప ప్రసాదం పంపిణీకి 2 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచారు. ఈ ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాలు సహా బిహార్‌, యూపీ, ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. వేలాదిమందితో నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ కిక్కిరిసిపోయింది. మందు కోసం ఆస్తమా బాధితులు పెద్ద ఎత్తున వస్తున్నారు. క్యూలైన్‌లో ఉన్నవారికి నాలుగు గంటలకుపైగా సమయం పడుతోంది. భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జాం అయ్యింది.

➡️