క్యూ ఆర్ కోడ్‌తో పాస్‌పుస్తకాలు
అక్లోబరు1నుంచి నూతన మద్యం పాలసీ
మంత్రి వర్గ నిర్ణయాలు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్ర వ్యాప్తంగా 22(ఎ) కింద ఉన్న భూముల రిజిస్ట్రేషన్లను మూడు నెలల పాటు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షత సచివాలయంలో బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ భూములపై పెరుగుతున్న ఫిర్యాదుల అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ నేపధ్యంలో గ్రామ సభలు నిర్వహించి, ఆ ప్రాంతంలోని ఈ తరహా భూములపై చర్చించి, తుది నిర్ణయానికి రావాలన్న అభిప్రాయాన్ని మంత్రులు
వ్యక్త ంచేశారు. గ్రామ సభలతో పాటే పరిశీలనను కూడా పూర్తి చేయాలని నిర్ణయించారు. మూడు నెలల కాలంలో ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని, అప్పటి వరకు ఈ భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. క్యాబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించిన రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి రెవెన్యూరికార్డులను తారుమారు చేయడం,ల్యాండ్ గ్రాబింగ్ వంటివి జరిగినట్లు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంల జిల్లాల్లో పర్యటించి భూముల బదిలీల్లో జరిగిన మోసాలు, దోపిడీలు, కబ్జాలు గుర్తించి వాటిని బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కూడా ఆధికారులను ఆదేశించినట్లు తెలిపారు. గత ఫ్రభుత్వం రూ.22.95కోట్ల వ్యయంతో జారీ చేసిన 21.86లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వముద్ర, క్యూఆర్‌కోడ్‌తో కూడిన కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేయాలని క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ రికార్డులు, పాస్‌బుక్‌లను తయారు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అక్టోబరు1నుంచి రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమలులోకి తీసుకురావాలని, ఈ లోగా అవసరమైన ప్రక్రియలనన్నింటిని పూర్తిచేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. వచ్చే నెల ఐదవ తేదిలోగా నూతన విధానాన్ని క్యాబినెట్ ముందుకు తీసుకువచ్చి ఆమోదం పొందాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. దీనికోసం అవసరమైతే క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం, కన్సల్టెన్నీ సేవలను పొందడం వంటి అంశాలను కూడా మంత్రివర్గం పరిశీలించనుంది. కొత్తగా అమల్లోకి రానున్న నూతన మద్యం విధానంలో రాష్ట్రంలోకి అక్రమ మద్యం రవాణా, గంజాయి, నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం (ఎన్‌డిపిఎల్) ప్రవేశించకుండా చర్యలు తీసుకోవడంతో పాటు అల్పాదాయ వర్గాలకు అందుబాటులో నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తుందని మంత్రి పార్ధసారధి తెలిపారు.
పిల్లలెందరున్నా అర్హులే…
ఇద్దరు పిల్లలకు మించి ఉన్న వారు పంచాయతీ, అర్భన్, లోకల్ బాడీస్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా పేర్కొంటటూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని క్యాబినెట్ సమావేశం నిర్ణయించింది. ఎపి పంచాయతీరాజ్‌చట్టం ా1994లోని సెక్షన్ 19కు చేసిన సవరణను కూడా రద్దు చేయాలని నిర్ణయించింది. కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడానికి గతంలో ఆ నిర్ణయాన్ని తీసుకున్నారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని మంత్రిమండలి అభిప్రాయపడింది. సంతానోత్పత్తి రేటు తగ్గుతుండటం , పనిచేయగల సామర్ధ్యంఉన్న జనాబాగణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో పిల్లల సంఖ్యపై నిషేధం అనవసరమని క్యాబినెట్ నిర్ణయించింది.
చెరువుల వేలం జిఓ రద్దు
మత్స్యకారుల హక్కులకు భంగం కలిగించేలా చెరువులను వేలం పాటకు అనుమతిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జిఓలను రద్దుచేస్తూ క్యాబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ జిఓలో భాగంగా నెల్లూరు జిల్లాలో 25,380 హెక్టార్ల సాగు నీటి విస్తీర్ణంతో ఎంపిక చేసిన 27 ప్రభుత్వ చెరువులను వేలం వేశారు. మత్స్యకారుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని ఆయా జీఓలను రద్దు చేయాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది.
మరికొన్న నిర్ణయాలు
. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కళాశాలల్లో అదనంగా 380 పోస్టుల భర్తీ
. పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లెల్లో నిర్మించిన నూతన వైద్యకళాశాలల్లో 100 సీట్లతో మొదటి సంవత్సరం కోర్సు ప్రారంభం.
. వైద్య కళాశాలల్లో గుజరాత్ పిపిపి మోడల్‌ను అధ్యయనం చేయడానికి చర్యలు
. నంద్యాల జిల్లా సుండిపెంట(శ్రీశైలం) గ్రామ పంచాయతీకి కేటాయించిన భూమిని రద్దు చేస్తూ జలవనరులశాఖకు బదిలీ చేసిన 208.74 ఎకరాల భూమిలో చేపట్టిన నిర్మాణాలను భవిష్యత్తు అవసరాల దృష్ట్యా యథాతదంగా ఉంచాలి.
. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ా1992 సెక్షన్ 3 ప్రకారం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు), రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ సంస్ధలపై మరో ఏడాది నిషేధం పొడిగింపు
