సికింద్రాబాద్‌-దానాపూర్‌ మధ్య 24 ప్రత్యేక రైళ్లు – దక్షిణ మధ్య రైల్వే

Apr 17,2024 15:46 #prakatana, #South Central Railway

హైదరాబాద్‌: వేసవి ప్రయాణికుల రద్దీని పరిగణలోకి తీసుకుని సికింద్రాబాద్‌-దానాపూర్‌ మధ్య 24 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్‌, మే, జూన్‌ చివరి వరకు ఈ ప్రత్యేక రైలు ప్రతి గురువారం సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరుతుందని, అలాగే ప్రతి శనివారం దానాపూర్‌ నుంచి బయలుదేరుతుందని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ నుంచి ఉత్తరప్రదేశ్‌-బిహార్‌ రాష్ట్రాలకు వెళ్లి వచ్చే ప్రయాణికుల కోసం వారానికోసారి అన్‌రిజర్వ్‌డ్‌ కోచ్‌లతో ఈ రైలును నడుపనున్నట్లు తెలిపారు.
అదేవిధంగా కాచిగూడ-కోచువెలి(07229) ఏప్రిల్‌ 18, 25 తేదీల్లో రెండుప్రత్యేక రైళ్లు, కోచువెలి-కాచిగూడ(07230) ఏప్రిల్‌ 19, 26 తేదీల్లో మరో రెండు ప్రత్యేక రైళ్లు, సికింద్రాబాద్‌-సంత్రాగచి(07221) ఏప్రిల్‌ 20 నుంచి జూన్‌ 29 వరకు ప్రతి మంగళ, శనివారం 21ప్రత్యేక రైళ్ల్లు, సంత్రాగచి-సికింద్రాబాద్‌ (07222) ఏప్రిల్‌ 21నుంచి జూన్‌ 30 వరకు ప్రతి బుధ, ఆదివారం 21ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ప్రయాగరాజ్‌-ఎస్‌ఎంవీటీబెంగుళూరు (04131) ఏప్రిల్‌ 21 నుంచి జూన్‌30 వరకు ప్రతిఆదివారం, ఎస్‌ఎంవీటీబెంగుళూరు-ప్రయాగరాజ్‌ (04132)ఏప్రిల్‌24 నుంచి జులై 3 వరకు ప్రతి బుధవారం, ఎస్‌ఎంవీటీ బెంగుళూరు-గౌహతి (06521)ఏప్రిల్‌ 16 నుంచి జూన్‌ 25 వరకు ప్రతి మంగళవారం, గౌహతి- ఎస్‌ఎంవీటీబెంగుళూరు-(06522) ఏప్రిల్‌ 20 నుంచి జూన్‌ 29 వరకు ప్రతి శనివారం, ఎస్‌ఎంవీటీ బెంగుళూరు-మాల్దాటౌన్‌ (06565) ఏప్రిల్‌17 నుంచి జూన్‌ 26 వరకు ప్రతి బుధవారం, మాల్దాటౌన్‌-ఎసఎంవీటి బెంగుళూరు-(06565) ఏప్రిల్‌ 20 నుంచి జూన్‌ 29 వరకు ప్రతి శనివారం, హౌరా-య?శ్వంత్‌పూర్‌ (02863) ఏప్రిల్‌18 నుంచి జూన్‌27 వరకు, యశ్వంత్‌పూర్‌-హౌరా (02864) ఏప్రిల్‌20 నుంచి జూన్‌ 29 వరకు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

➡️