కలుషిత నీరు తాగి 25 మందికి అస్వస్థత

ప్రజాశక్తి-జమ్మలమడుగు రూరల్‌ : కడప జిల్లా జమ్మలమడుగులోని కన్నెలూరు, నేతాజీనగర్‌లో కలుషిత నీరు తాగి 25 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితుల వివరాల మేరకు.. గత కొద్ది రోజులుగా కలుషితమై తాగునీరు వస్తోందని, అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నీరు తాగడం వల్ల పలువురు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వీరు స్థానిక క్యాంబెల్‌, ప్రభుత్వ ఆస్పత్రి, ప్రయివేటు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, ఎపి చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరనాల శివ నారాయణ, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్‌ తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

➡️