వాణిజ్య పంటలకు 50 వేలు నష్టపరిహారం
సెప్టెంబర్ 17, 18 గ్రామ సచివాలయాలకు వినతి – 23, 24 మండలాల వద్ద రైతు ధర్నా
సెప్టెంబర్ 26న జిల్లా కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయండి
మర్రాపు సూర్యనారాయణ
ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో దెబ్బతిన్న వరి పంటకు ఎకరాకు రూ.25000, వాణిజ్య పంటలకు రూ.50000 చొప్పున్న నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో సచివాలయం వద్ద సెప్టెంబర్ 17, 18 తేదీల్లో మండల కేంద్రాల్లో 23,24 తేదీల్లో 26 న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నమని ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ తెలిపారు. గురువారం స్థానిక ఎన్ పి అర్ శ్రామిక భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షానికి ప్రభుత్వం ప్రకటించిన 5,67000 ఎకరాలు కంటే మూడు రెట్లు ఎకరాలకు పంట నష్టం జరిగిందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10,000 నష్టపరిహారం సరికాదన్నారు. వరి పంటకు 25000, వాణిజ్య పంటలకు రూ.50,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు నాయుడు పెట్టుబడి సాయం రూ.20,000 ఇస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చారు. రైతులకు రూ॥20వేలు పెట్టుబడి సాయం ఇవ్వాలన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడిచిపోయింది. వ్యవసాయానికి పెట్టుబడుల కొరకు బ్యాంకులు ఇతర ప్రైవేటు వడ్డీ వ్యాపారుల చుట్టూ రైతులు, కౌలు రైతులు తిరగాల్సి వస్తున్నదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.20 వేల పెట్టుబడి సాయం రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. కనుక తక్షణమే ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడి సాయం రైతుల ఖాతాలో వెంటనే జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కౌలు రైతుకు గుర్తింపు కార్డు – బ్యాంకు రుణాలు-సంక్షేమ పధకాలు ఇవ్వాలన్నారు.
రాష్ట్రంలో 30 లక్షల మందిపైగా కౌలుదారులు ఉన్నారు. కౌలు వ్యవసాయం విస్తరిస్తున్నది. భూయజమాని సంతకంతో నిమిత్తం లేకుండా వాస్తవ కౌలుదారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలనారు. అన్నదాత సుఖీభవ రూ. 20,000 పెట్టుబడి సాయంతో పాటు బ్యాంకు రుణాలు, రైతు సంక్షేమ పథకాలు అన్ని అమలుచేయాలన్నారు. 10 లక్షల మంది కౌలుదారులకు గుర్తింపు కార్డులు ఇస్తామని ప్రకటించి అమలు చేస్తామన్నారు. కౌలురైతు గుర్తింపు కార్డుల పంపిణిలో వాస్తవ సాగుదారులకు కాకుండా బినామీలు, అనర్హులకు కౌలు గుర్తింపు కార్డులు ఇస్తున్నారు. ఈ మోసాన్ని అరికట్టాలన్నారు. వాస్తవసాగుదారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రభుత్వం సంక్షేమ పధకాలు అమలు చేయాలన్నారు. 2023 పంటల భీమా ఇవ్వాలి- ప్రతి రైతుకు 2లక్షలు రుణమాఫీ చేయాలి కరువు కారణంగా వంటలు పండక పోవడం, పంటలు పండినా గిట్టుబాటు ధర లేకపోవడం
ప్రకృతి వివత్తులు, మార్కెట్ ఒడిదుడుకుల మధ్య వ్యవసాయం గిట్టుబాటుగాక రైతులు అప్పుల పాలు అవుతున్నారన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ప్రతీ రైతుకు సగటున రూ.2.50 లక్షలు అప్పులు ఉన్నాయి. సగటు రైతు కుటుంబం అప్పుల నుండి బయటపడలేకపోతున్నది. కనుక రాష్ట్ర ప్రభుత్వం రూ.2.00 లక్షల వరకు రైతులు అన్ని రకాల బ్యాంకు రుణాలను మాఫీ చేయవలసిందిగా కోరుచున్నామన్నారు. పక్కనే తెలంగాణా రాష్ట్రంలో రూ.2:00 లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేసింది. మన రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణాలు మాఫీ చేసి రైతులను అదుకోవాలన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాదు కేంద్ర బిజెపి ప్రభుత్వ ఒత్తిడితో గత ప్రభుత్వం వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టేందుకు జి.ఓనెం. 22 తెచ్చిందన్నారు. మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తే మంత్రి లోకేష్ బాబు మీటర్లను పగులగొట్టమని పిలుపు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని అనుసరించడం సరైనది కాదన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టడం అదాని కంపెనీకి తప్ప రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదు కనుక జిఓ నెం 22 రద్దుచేయాలన్నారు. పరిపోరం తక్షణమే రైతులకు ఇవ్వాలన్నారు.
గత సంవత్సరం 2023 ఖరీఫ్ లో కరువు వల్ల మెట్ట ప్రాంతాలలో పంటలు పండక రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రంలో 350 కి పైగా మండలాలలో వర్షాభావ పరిస్థితులు ఉంటే గత ప్రభుత్వం 102 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించింది. కరువు, తుఫాన్లతో నష్టపోయిన రైతాంగానికి ఇప్పటివరకు ఎలాంటి సహాయం అందలేదన్నారు. 2023 ఖరీఫ్, రబీ సీజన్లో వంటలు నష్టపోయిన రైతులకు వంటల బీమా పరిహారం ఇవ్వాలి, గడిచిన 3,4 సంవత్సరాలు వంటలబీమా పరిహారం జూన్, జూలై మాసాలలో రైతుల ఖాతాలలో జమచేశారు. కానీ ఈ సంవత్సరం ఆగస్టు దాటినా పంటల బీమా పరిహారం రైతులకు అందలేదు. తక్షణమే వంటలబీమా పరిహారం రైతుల ఖాతాలలో జమచేయాలని కోరారు.
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి, భూసేకరణ లో 2013 చట్ట ప్రకారం పరిహారం తదితర సమస్యలు పరిష్కరించండి జిల్లా లోసుమారు 4 లక్షలుసాగునీరు అందించే ఉత్తరాంద్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకునిధులు కేటాయించి పూర్తి చేయాలన్నారు. అసంపూర్తిగా వున్న ప్రాజెక్టులు, కాలువలు తారకరామ, గుర్ల గెడ్డ, తోటపిల్లి, గజపతినగరం బ్రాంచీ కాలువ నిధులు ఇచ్చి పూర్తి చేయాలనీ డిమాండ్ చేశారు. తోటపల్లి, మడ్డువలస, వెంగళరాయ, తాటిపూడి, ఆండ్రకాలువలు సిమ్మెంట్ లైనింగ్ చేసి చివరి ఆయకట్టువరకు నీరు అందించాలన్నారు. చిన్ననీటివనరులు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు మరమ్మత్తులు చేసి సాగునీరు అందించాలి. జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవే, సుజల స్రవంతి కాలువ, గిరిజన యూనివర్సిటీ, ఎయిర్ పోర్ట్, 516 పెందుర్తి- బొడ్డవర హైవే, రహదారులు, రైల్వేతదితర భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు 2013 చట్టప్రకారం పరిహారం ఇవ్వాలన్నారు.
జిల్లాలో సహకార రంగం లో వున్న భీమసింగ్ చక్కెర ఫాక్టరీ కి ఆధునీకరణకు నిధులు ఇచ్చితెరిపించాలి. ఎన్.సి.ఎస్ షుగర్ ఫాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తెరిపించాలనీకోరారు. సుమారు లక్ష ఎకరాలులో మామిడిపంట మార్కెట్లో ధరరాక నష్టపోతున్న రైతులను ఆదుకొనడానికి జూన్ | ఫాక్టరీ మరియు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నిర్మించాలనీ కోరారు. జరిగిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని,రైతులను,కౌలు రైతుల ను ఆదుకోవాలని కోరుతూ సెప్టెంబర్ 17,18 సచివాలయాలకు వినతి, 23,24 తేదీల్లో మండలాల ధర్నాలు సెప్టెంబర్ 26న జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమంలో రైతులు,కౌలు రైతుల అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. విలేకర్ల సమావేశంలో ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబు, కౌలు రైతుల సంఘం నాయకులు రాకోటి రాములు పాల్గొన్నారు.
