26 టన్నుల రేషన్‌ బియ్యం పట్టివేత

ప్రజాశక్తి-గన్నవరం (కృష్ణా జిల్లా) : కృష్ణాజిల్లా బాపులపాడు మండలం కొత్తమల్లవల్లి పారిశ్రామికవాడ నుంచి రహస్యంగా తరలిస్తున్న 26 టన్నుల రేషన్‌ బియ్యం లారీలను బుధవారం వీరవల్లి పోలీసులు, సివిల్‌ సప్లై అధికారులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన పసుపులేటి శ్రీనుబాబు అనే వ్యక్తి నూజివీడు ఏరియాలో కొనుగోలు చేసిన రేషన్‌బియ్యాన్ని రెండు లారీల్లో ఎత్తి రాజమండ్రిలోని కోళ్ల ఫారాలకు తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, సివిల్‌ సప్లై అధికారులు కొత్తమల్లవల్లి పారిశ్రామికవాడ పరిసర ప్రాంతాల్లో దాడి చేసి లారీలను పట్టుకుని సీజ్‌ చేశారు. 26 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్లను అరెస్టు చేసి క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.

➡️