పొగాకు కిలో రూ.280

Mar 11,2025 00:22 #Rs.280 per kg, #Tobacco
  • నాలుగు కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభం

ప్రజాశక్తి-ఒంగోలు బ్యూరో : ఒంగోలు రీజియన్‌ పరిధిలోని నాలుగు కేంద్రాల్లో పొగాకు వేలం సోమవారం ప్రారంభమైంది. కిలో పొగాకును రూ.280లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. పొదిలి, కొండపి, ఒంగోలు, కందుకూరు కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు జరిగాయి. ఈనెల 19న మిగతా కేంద్రాల్లోనూ వేలం ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కొక్క వేలం కేంద్రానికి 18 నుంచి 20 బేళ్లు వరకూ వచ్చాయి. గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.278 పలికింది. నాలుగు కేంద్రాల్లో కలిపి మొత్తం 81 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. గతేడాది కిలో రూ.230లతో కొనుగోలు ప్రారంభమైంది. రూ. 365తో ముగిసింది. కర్ణాటకలో కిలో పొగాకు ధర రూ.300తో ప్రారంభమైంది.

➡️