29 కిలోల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం

Apr 19,2024 00:52 #2024 election, #illegal liquor, #sized
  •  1190 మద్యం బాటిళ్లు స్వాధీనం

ప్రజాశక్తి-యంత్రాంగం : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి అధిక మొత్తంలో తరలిస్తున్న నగదు, నగలు, మద్యం, ఇతర విలువైన వస్తువులను పట్టుకుని సీజ్‌ చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా గోపవరం మండల పరిధిలోని పిపి కుంట చెక్‌పోస్టు వద్ద పోలీసులు గురువారం వాహన తనిఖీలు చేపట్టారు. సీక్వెల్‌ గ్లోబల్‌ ప్రీసియస్‌ లాజిస్టిక్స్‌ అనే కంపనీకి చెందిన బొలెరో వాహనాన్ని పరిశీలించగా 29 కిలోల బంగారం, వెండి వస్తువులను గుర్తించారు. ఆభరణాలను రెవెన్యూ అధికారుల సమక్షంలో సీజ్‌ చేశారు. పట్టుబడిన బంగారం, వెండి విలువ సుమారు రూ.5 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. బంగారం, వెండి ఆభరణాలకు సంబంధించి పత్రాలను పరిశీలిస్తున్నట్లు బద్వేల్‌ రూరల్‌ సిఐ విక్రమ్‌ సింహ, ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు. ఎన్‌టిఆర్‌ జిల్లా వత్సవాయిలో అక్రమంగా నిల్వ ఉంచిన 1190 మద్యం బాటిళ్లను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. వల్లంకొండ రమణయ్య, చీకటిమళ్ల, షేక్‌ నాగులు, వల్లంకొండ రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు సెబ్‌ జగ్గయ్యపేట సిఐ మణికంఠ రెడ్డి తెలిపారు.

➡️