ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఈనెల 3నుంచి 21వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. ఈ మేరకు మంగళవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజరురామరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. మొదటి సెషన్ ఉదయం 9.30 గంటల నుంచి 12గంటల వరకు జరుగుతుందని, రెండవ సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతుందని పేర్కొన్నారు. ఇంత వరకు హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోని అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ష్ట్ర్‌్‌జూ//షరవ.aజూ.స్త్రశీఙ.ఱఅ వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు. ప్రతిజిల్లాలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సహాయ కేంద్రం ఏర్పాటు చేశామని, అభ్యర్థులకు ఎలాంటి సందేహాలున్నా సహాయ కేంద్రానికి ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రానికి అభ్యర్థి తప్పని సరిగా తన గుర్తింపు కార్డు తీసుకెళ్లాలని సూచించారు.