లోక్‌అదాలత్‌లో 49 వేల కేసులు పరిష్కారం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం హైకోర్టుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని న్యాయస్ధానాల్లో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో 49,056 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా సెషన్స్‌ న్యాయమూర్తి, సభ్య కార్యదర్శి ఎం బబిత పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. హైకోర్టులో నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌కు జస్టిస్‌ అవధానం హరాహరనాథ్‌శర్మ, జస్టిస్‌ డాక్టర్‌ వై లక్ష్మణరావు అధ్యక్షత వహించారు. హైకోర్టులో 125 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 343 లోక్‌అదాలత్‌ బెంచీలను ఏర్పాటు చేయగా.. 4842 కేసులు పెండింగ్‌ కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. వీటితో పాటు ఫ్రీ లిటిగేషన్‌ కేసులు 789 పరిష్కరించినట్లు పేర్కొన్నారు.

➡️