రాష్ట్రానికి రూ.5,656 కోట్లు

Jun 12,2024 09:56 #Budget, #State

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి:కేంద్ర పన్నుల్లో వాటాగా రాష్ట్రానికి రూ.5,656 కోట్లు వచ్చాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ నుంచి రాష్ట్రానికి లేఖ అందింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.2.79 లక్షల కోట్లు విడుదల చేయగా, అందులో జూన్‌ నెలకు సంబందించి 1,39,750 కోట్లు విడుదలయ్యాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరనున్నవేళ ఈ నిధులు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా జూలై ఒకటో తేదీన పంపిణీ చేయాల్సిన సామాజిక పింఛన్లకు ఈ నిధులు మేలు చేస్తాయని అంటున్నారు.

➡️