- ఐదుగురు నిందితులు అరెస్ట్
ప్రజాశక్తి-వీకోట : మన్యం జిల్లా నుండి చిత్తూరు జిల్లా వీకోటకు గాంజా తరలిస్తున్న ముఠాను వి కోట పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. పలమనేరు డి.ఎస్.పి ప్రభాకర్ కథనం మేరకు వివరాలు వీకోట మండలానికి చెందిన పరంధామ లారీ డ్రైవర్ గా జీవనం సాగిస్తూ తరచు మన్నెం జిల్లా నుండి వీకోటకు గాంజాను తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు తనిఖీ చేసి నిందితులను అదుపులోనికి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరంధామ స్థానికంగా ఐదు మందితో కలిసి గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నామన్నారు. వీరి వద్ద నుండి సుమారు ఎనిమిది కిలోల గాంజా స్వాధీనం చేసుకున్నామన్నారు. వి కోట మండలానికి చెందిన పరంధామ, ఆందోని, దావూద్, చిరంజీవి, శివ ల పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లువారు తెలిపారు. ఈ ముఠా కు సంబంధించి మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తామని వారు తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి నిషేధిత వస్తువుల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హచ్చరించారు.