విశాఖపట్నం: నగరంలో జీవీఎంసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ 92 మంది వార్డు సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలైన ఆసరా, అమ్మఒడి, చేయూత, తోడు, పేదలందరికీ ఇళ్లు పథకాలకు సంబంధించి.. క్షేత్రస్థాయిలో సర్వే, లబ్ధిదారుల ఎంపిక విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని 5వ జోనల్ కమిషనర్ ఈ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 20వ తేదీలోగా వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. మార్చి నెల జీతం నిలిపివేయడంతో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ నోటీసులపై ఆందోళన చెందుతున్న కార్యదర్శులు జోనల్ కమిషనర్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు.
