93.37 శాతం పింఛన్ల పంపిణీ

ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలో 93.37 శాతం మంది ఎన్‌టిఆర్‌ భరోసా పెన్షన్‌ స్కీమ్‌ లబ్ధిదార్లకు పింఛన్లను పంపిణీ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఎన్‌టిఆర్‌ భరోసా పెన్షన్‌ స్కీమ్‌ సైట్‌లో వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలో 64,61,485 మందికి పింఛన్లు విడుదల కాగా, 60,33,325 మందికి పంపిణీ చేశారు. రూ.2729.86 కోట్లను పంపిణీ చేయాల్సి ఉండగా, రూ.2,548 కోట్లను పంపిణీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీకి అంతరాయం కలిగినట్లు అధికారులు వెల్లడించారు.
భారీ వర్షాలున్న ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు సిఎం చంద్రబాబు వెసులుబాటు కల్పించారు. ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులుంటే వచ్చే ఒకటి, రెండు రోజుల్లో పంపిణీ పూర్తి చేయవచ్చని చెప్పారు. ఈ విషయంలో సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావద్దని, టార్గెట్‌ పెట్టవద్దని కలెక్టర్లను ఆదేశించారు.

➡️