పని ఒత్తిడి తట్టుకోలేక బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య

నిజాంపేట (తెలంగాణ) : పని ఒత్తిడి తట్టుకోలేక బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం నిజాంపేటలో జరిగింది. సీఐ జె.ఉపేందర్‌ వివరాల ప్రకారం…. ఏపీలోని పిఠాపురానికి చెందిన కోట సత్యలావణ్య (32) కు అదే ప్రాంతానికి చెందిన బత్తుల వీరమోహన్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. నిజాంపేట బాచుపల్లి ఠాణా పరిధిలో బాచుపల్లి కేఆర్‌సీఆర్‌ కాలనీలోని ఎం.ఎన్‌.రెసిడెన్సీలో నివాసముంటున్నారు. భర్త ఐటీ ఉద్యోగి. సత్య లావణ్య బాచుపల్లి రాజీవ్‌గాంధీ నగర్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో సహాయ మేనేజర్‌. కొన్నాళ్లుగా బ్యాంకులో పని ఒత్తిడి ఉన్నట్లు ఆమె బంధుమిత్రుల వద్ద వాపోయిందని సమాచారం. సంక్రాంతికి శుక్రవారం సొంతూరుకు వెళ్లడానికి సన్నాహాలు చేసుకున్నారు. గత గురువారం మధ్యాహ్నం బ్యాంకులో ఉన్నతాధికారులకు చెప్పి ఇంటికి వెళ్లిన ఆమె నేరుగా అపార్ట్‌మెంట్‌ టెర్రస్‌పైకి వెళ్లి కిందకు దూకారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు ఎస్‌ఎల్‌జీ ఆసుపత్రికి తరలించగా కొంతసేపటికే మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️