తల్లిదండ్రుల చెంతకు తప్పిపోయిన బాలుడు

Apr 13,2025 20:40 #boy, #gone missing, #parents, #ttd

ప్రజాశక్తి-తిరుపతి సిటీ : తప్పిపోయిన ఐదేళ్ల బాలుడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చిన సంఘటన తిరుపతి వెస్ట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతికి చెందిన శంకర్‌ గణేష్‌, తన భార్యతోనూ, కుమారుడు దక్షిత కుమార్‌ (5)తోనూ కలిసి శ్రీకోదండ రామస్వామి తెప్పోత్సవాలను తిలకించేందుకు వచ్చారు. స్వామివారి పుష్కరణ వద్ద బాలుడు తప్పిపోయాడు. దీంతో శంకర్‌ గణేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌పి వి.హర్షవర్ధన్‌ రాజు ఆదేశాల మేరకు తిరుపతి వెస్ట్‌ సిఐ మురళీమోహనరావు తన సిబ్బందితో కలిసి బాలుడిని పది నిమిషాల్లోనే కనిపెట్టి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో పోలీసులు సిబ్బందిని ఎస్‌పి అభినందించారు.

➡️