‘అనంత’ దారుణ హత్య

ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురంలోని రెండవ రోడ్డు వద్ద దారుణ హత్య జరిగింది. నగరంలోని 2వ రోడ్ ఫ్లై ఓవర్ కింద ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని ఆటోతో వెంబడించి అతన్ని ఢీ కొనడంతో రోడ్డు పక్కన పడ్డాడు. ఇదే అదునుగా చూసుకొని పక్కనే ఉన్న సిమెంటు దిమ్మెను అతని తలపై వేశారు. దీంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడు నగరంలోని రహమత్ నగర్ కు చెందిన సుగాలి జైపాల్ నాయక్ గా గుర్తించారు.

➡️