హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధి బైరాగిగూడలో తుపాకీ బుల్లెట్ కలకలం రేపింది. ఓ అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్తులోకి దూసుకువచ్చిన బులెట్ అద్దాన్ని బద్దలు కొట్టింది. దీంతో ఒక్కసారిగా ఇంట్లోని వ్యక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఇంటి యజమాని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లో బుల్లెట్ లభ్యంపై నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ బులెట్ ఆర్మీ రెంజ్‌లో ఫైరింగ్ ప్రాక్టిస్ చేస్తున్న జవాన్ల గన్‌మిస్ ఫైర్ కావడంతో అపార్ట్‌మెంట్‌లోకి దూసుకువచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
