అనంతపురం : ఆర్‌టిసి బస్టాండ్‌లో బస్సు ప్లాట్ ఫాం మీదికి దూసుకొచ్చిన ఘటన ఆదివారం అనంతపురంలో జరిగింది. ఆ సమయంలో అక్కడ ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. నిన్న ఉదయం 6 గంటల 25 నిమిషాలకు శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అనంతపురం బస్టాండ్‌లోని 8వ నంబరు ప్లాట్‌ఫాం వద్దకు వచ్చింది. అయితే డ్రైవర్ ఫ్లాట్ ఫాం దగ్గరకు రాగానే బ్రేక్ వేసినా పడకపోవడంతో బస్సు ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లింది. మళ్లీ వెనక్కి వెళ్లి రెండోసారి ప్లాట్‌ఫాం మీదకు వచ్చి నిలబడింది. ఆ ధాటికి అక్కడే ఉన్న వైద్య విద్యార్థిని వీణ కాలికి స్వల్ప గాయాలయ్యాయి. రెండోసారి బ్రేకు వేయాల్సింది పోయి ఎక్సలేటర్ మీద తొక్కడంతో ప్లాట్‌ఫాం మీదకు బస్సు వెళ్లిందని సిఎంఈ మోహన్‌కుమార్, ఆర్టీసీ డీఎం నాగభూపాల్ తెలిపారు.
