అలిపిరి వద్ద కారు దగ్ధం..

May 16,2024 11:25 #alipiri, #Fire Accident

తిరుపతి: తిరుపతిలోని అలిపిరి వద్ద ఓ కారు మంటలకు ఆహుతైంది. అలిపిరి గరుడా సర్కిల్‌ వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన కారు డ్రైవర్‌ వాహనాన్ని పక్కక నిలిపివేశారు. డ్రైవర్‌తో పాటు కారులో నుంచి యాత్రికులు బయటకు పరుగులు తీశారు. తిరుమల నుంచి తిరుపతికి తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే కారులో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

➡️