టిడిపి నేత జేసీ దివాకర్‌ రెడ్డి కుటుంబంపై కేసు నమోదు

అనంతపురం : టిడిపి నేత జేసీ దివాకర్‌ రెడ్డి కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్‌ సందర్భంగా తాడిపత్రి పట్టణంలో జేసీ కుటుంబ సభ్యులు విధ్వంసం సృష్టించారు. తాడిపత్రి టిడిపి అభ్యర్థి జేసీ అస్మిత్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి, జేసీ పవన్‌ రెడ్డిలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. జేసీ కుటుంబ సభ్యులతో పాటు 100 మంది టిడిపి కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వారుపై టిడిపి నేతలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఐదు వాహనాలు ధ్వంసం కాగా, ఇద్దరు కానిస్టేబుళ్లు సహా పలువురు వైసిపి కార్యకర్తలు గాయపడ్డారు. ఈ ఘటనలపై పోలీసులు విచారణ చేపట్టారు.

➡️