సిఎంపై దాడికేసులో నిందితుల్ని పట్టిస్తే రూ.2 లక్షల నగదు బహుమతి

Apr 15,2024 16:16

విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయ త్నం చేసిన నిందితుల వివరాల చెప్పిన వారికి ఎన్టీఆర్‌ జిల్లా పోలీసులు నగదు బహుమతిని ప్రకటించారు. సీఎం జగన్‌పై గుర్తు తెలియని వ్యక్తి, వ్యక్తులు గురించి ఏదైనా సమాచారం ఉన్నా, తెలిసినా తమకు తెలపాలని ఎన్టీఆర్‌ జిల్లా పోలీసులు కోరారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై దాడికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం ఇచ్చిన వారిని నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. దాడిపై సమాచారం ఇచ్చిన వారికి రూ.2లక్షలు నగదు బహుమతి ఇవ్వనున్నట్టు పోలీసులు తెలిపారు. వారి వివరాలను ఈ కింది నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వివరాల తెలిపిన వారి పేపర్లను గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు. ఆచూకీ తెలిస్తే సెల్‌ నంబర్లలో 9490619342, 9440627089 సంప్రదించాలని కోరారు.

➡️